హైదరాబాద్ మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితురాలు ఒక్కసారిగా దూరంగా ఎగిరిపడినట్టు సమాచారం. వెంటనే బాధితురాలని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ఈ ప్రమాదంలో సదరు మహిళ కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అయితే, హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని సదరు నిర్మాతను కుటుంబ సభ్యులు అడుగగా.. డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పినట్టు సమాచారం.
ప్రమాదం చేసింది తాను కాదని, తన డ్రైవర్ అని.. కావాలంటే అతన్నిచంపుకోండని.. పైసలు మాత్రం ఇచ్చేదిలేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. సదరు నిర్మాతను బొమ్మకు మురళిగా గుర్తించారు. ఆయన బాధిత కుటుంబసభ్యులతో దురుసగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
https://x.com/TeluguScribe/status/2087795112038588584?s=20
ముందుగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? లేడా? అని ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిర్మాత కారు నడిపిన డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా,ప్రమాదానికి కారణమైన కారు ఆ సమయంలో ఓవర్ స్పీడ్‌తో ఉందని ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


