ఏపీ

CBN Emotional: గ్రాఫిక్స్ అన్నవాళ్లు ఇక్కడికి వచ్చి చూడండి.. చంద్రబాబు భావోద్వేగం!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశతో పాటు, విజయవాడ-మంగళగిరి రహదారిని అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ.82కోట్లతో అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన స్టీల్ వంతెనను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశతో పాటు, విజయవాడ-మంగళగిరి రహదారిని అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ.82కోట్లతో అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన స్టీల్ వంతెనను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి సమీపంలో ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం స్వయంగా కాలినడకన వంతెనను, నూతన రహదారి నిర్మాణాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో చంద్రబాబునాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజధాని అమరావతి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూములిచ్చిన అన్నదాతలు చేసింది కేవలం భూత్యాగం మాత్రమే కాదని, రాబోయే తరాలకు, ప్రపంచానికే దిశానిర్దేశం చేసే మహోన్నత స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణంలో రైతులను నేరుగా భాగస్వాములను చేశామని చెప్పారు. కేవలం 58 రోజుల్లోనే 29వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూమిని అప్పగించారని గుర్తుచేశారు.

ప్రపంచంలో ఎక్కడా లేని ఈ ఉదారతకు అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తదనంతరం ఎదురైన క్లిష్ట పరిస్థితులను స్మరిస్తూ, ఏమీలేని శూన్యం నుంచి నేడు ప్రపంచం గర్వించే రీతిలో స్వయం సమృద్ధి కలిగిన రాజధానిని నిర్మించుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. గతంలో సైబరాబాద్, హైటెక్ సిటీలను నిర్మిస్తున్న సమయంలో కూడా కొందరు హేళన చేశారని గుర్తు చేసుకున్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలో దేశానికే ఆదర్శంగా నిలవడం ఒక నాయకుడిగా తనకు ఎంతో గర్వకారణమన్నారు.

విభజన తర్వాత 58శాతం జనాభాతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అత్యంత సమర్థవంతమైన, ప్రపంచస్థాయి గ్రీన్ సిటీని అమరావతి రూపంలో తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో అమరావతి అభివృద్ధిని కేవలం 'గ్రాఫిక్స్' అంటూ గేలి చేసిన విమర్శకులు ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే ఇక్కడ జరుగుతున్న అద్భుత ప్రగతి ఏంటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుందని హితవు పలికారు. పర్యావరణహితంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులతో మురుగునీటి, విద్యుత్ మార్గాలను భూగర్భంలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

#Chandrababu Naidu Amaravati#Seed Access Road Inauguration#Buckingham Canal Steel Bridge#Amaravati Capital Construction#AP CM Chandrababu Speech#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి