సినిమా

Raaka: హీరోయిన్స్ రోల్స్ పై బాలీవుడ్ లో టాక్ ఇదేనా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా గురించి ఇప్పుడు, బాలీవుడ్ మీడియాలో ఓ లేటెస్ట్ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రాకా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు అట్లీ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

అల్లు అర్జు, దీపిక పడుకొణ్ జంటగా రూపొందుతుంది రాకా. ఈ సినిమాలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఓ శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో అలరించబోతోందట.

అంతేకాదు, 'రాకా' కథా ప్రపంచంలో జాన్వీ రోల్ ఎంతో ముఖ్యమైనదని, కథను మలుపు తిప్పేలా ఈ పాత్రని డిజైన్ చేసినట్టుగా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇక, ఇప్పటికే 'పెద్ది' సినిమాతో ఈ ఏడాది మన ముందుకు వచ్చిన ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. అలాగే, ఇప్పుడు చేస్తున్న రాకాలోని ఈ గిరిజన రాణి పాత్ర కెరీర్‌లోనే మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు.

అలాగే, నేషనల్ క్రష్ రష్మిక మందన్నది ఎంతో కీలకమైన పాత్రట. ఆమె కూడా పురాణ కాలం నాటి ఒక రక్షకురాలి పాత్రలో కనిపించబోతుందట. ఈ పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతోంది. 'రాకా' రెండు భాగాలుగా రూపందుతున్నట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి. మొదట్లో ఈ కథను ఒక పార్ట్‌గానే అనుకున్నారట.

కానీ, అట్లీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేసరికి కథా పరిధి ఊహించిన దానికంటే ఎక్కువ భారీ తనంతో పెరిగిపోయిందట. దాంతో, ఒక్క భాగం సరిపోదని మేకర్స్ భావించి, ఒక భాగం పూర్తిగా ఫాంటసీ ఎలిమెంట్స్‌తోనూ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో... రెండో భాగం ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో రూపొందించేలా ప్లాన్ చేశారట. మొత్తానికి, రాకా నుంచి వస్తోన్న రోజుకో వార్త సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచుతున్నాయి.

#janhvi kapoor#raaka#alluarjun#atleekumar#deepikapadukone
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి