తెలంగాణ

Telangana: ఊహించని మలుపు తిరిగిన ఓటుకు నోటు కేసు!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటు కోసం డబ్బు ఇవ్వజూపారన్న ఆరోపణలతో అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలోనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది.

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటు కోసం డబ్బు ఇవ్వజూపారన్న ఆరోపణలతో అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలోనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రిజర్వ్ వరకు వెళ్ళింది. అయితే.. అనూహ్యంగా ఈ కేసు విచారణ.. మళ్లీ మొదటి దశకు చేరుకుంది.. కాగా గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడమే ఇందుకు కారణం.. అయితే న్యాయ ప్రక్రియ నిబంధనల ప్రకారం..

పాత బెంచ్‌లో విన్న వాదనలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకోలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి ఓటుకు నోటు కేసును విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి పిటిషనర్లు, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది.

మరోవైపు ఈ కేసులో ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. దీంతో ఈ కేసు విచారణపై రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.

ఇన్నాళ్లు చప్పుడు లేకుండా ఉన్న ఓటుకు నోటు కేసు.. ఇప్పుడు సుప్రీంకోర్టులో రీ-హియరింగ్‌కు రావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది..

#Vote for Note#Supreme Court#Suryakant#New Bench#unexpected turn
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి