సినిమా

Ram Charan: RC 17 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్..సుకుమార్ ప్లాన్ మారిందా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. అయితే, తాజా సమాచారం మేరకు, ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకముందు రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించాడు. చరణ్ ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. పవర్ ఫుల్ రోల్ తో పాటు స్టూడెంట్‌గా కనిపించాడు. ఇక, ఈ సినిమాలో కామెడీ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్‌గా నటించారు.

మళ్ళీ ఇంతవరకూ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించలేదు. చరణ్ గత చిత్రం పెద్ది ఆశించిన విజయాన్ని అందుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, చరణ్ పాత్రలకి మాత్రం ఖచ్చితంగా అవార్డ్ వస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ చరణ్ కి సాలీడ్ హిట్ దక్కలేదు. దాంతో, సుకుమార్ సినిమాతో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్కేల్ లో నిలబడాలనుకుంటున్నాడు.

ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న ఆర్సీ 17 కోసం చరణ్ సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మైత్రీకి భారీ హిట్ ఇచ్చిన రంగస్థలం సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చింది. దాంతో, మళ్ళీ ఇదే కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుండడంతో అంచనాలు బాగానే మొదలయ్యాయి.

#RamCharan#RC17#Sukumar#MythriMovieMakers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి