Jr.NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన నేపథ్యంలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం అయిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో గత నెల 27న తారక్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో, షూటింగ్ మధ్యలో నుంచే ఆయన హైదరాబాద్ వచ్చాడు.
పరీక్షలు నిర్వహించిన కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం బుధవారం నాడు ఆయనకు ఆర్దోపెడిక్ సర్జరీ చేశారు. ఈ సర్జరీని డాక్టర్స్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ శ్రీనివాస్ రావు తో పాటు డాక్టర్ మధుసుదన్ రావు కలిసి చేశారు. ఇక, ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని నిన్న వెళ్ళడించారు. ఆయన, పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రి వర్గాలు తారక్ ని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా, డాక్టర్ల బృందం ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక, ఈ సందర్భంగా, ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆసుపత్రి మేనేజ్‌మెంట్ హెల్త్ బులిటెన్ ని కూడా తాజాగా విడుదల చేసింది. కాగా, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. సర్జరీ తర్వాత, ఆయనకు అవసరమైన అన్ని వైద్య సహాయాలు ఇవ్వడం జరిగింది. అలాగే, డాక్టర్లు తారక్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక, ఎన్టీఆర్ త్వరలోనే తన సాధారణ కార్యకలాపాలకు తయారవుతాడని నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలంటూ..పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇక, తారక్ ఎంత కాదన్నా, 3 నెలల పాటు షూటింగ్ కి రాలేని పరిస్థితి. దీంతో, డ్రాగన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఈ మూడు నెలలు ప్రభాస్ నటించబోయో సలార్ 2 కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్, నటీనటులను, లొకేషన్స్‌ని ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. ఈ 3 నెలల్లో సలార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి తారక్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడని తెలియగానే డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.












