తెలంగాణ

Cm Revanth: చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే..! సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రచన: NK••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కరవు రావాలని కొంతమంది అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసే పని ఇదేనా? అని రేవంత్ ప్రశ్నించారు. చేతబడి పూజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా అన్న సీఎం రేవంత్.. మీరు చేసిన చేతబడి మీపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుందని హెచ్చరించారు.

Cm Revanth: రాష్ట్రంలో కరవు రావాలని కొంతమంది అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసే పని ఇదేనా? అని రేవంత్ ప్రశ్నించారు. చేతబడి పూజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా అన్న సీఎం రేవంత్.. మీరు చేసిన చేతబడి మీపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుందని హెచ్చరించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి వాళ్లు అఘోరా పూజలు చేసినా దేవుడు మనతోనే ఉన్నాడని రేవంత్ అన్నారు. 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన తనకుందన్నారు. రాష్ట్రం బాగు కోసం నా సంకల్పం, అందుకే వర్షాలు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్. అనంతరం ఆయన మాట్లాడుతూ వానలు కురవకుండా కొందరు అఘోరా పూజలు చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు.

''అన్నీ ఉన్నా ఒక్కోసారి అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంటుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు కేసీఆర్ పరిస్థితి ఉంది. కేసీఆర్ కు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉండి ఆయన్ని మింగేశాడు. ఇవాళ పక్క రాష్ట్రాలకు వెళ్లి అఘోరా పూజలు చేస్తున్నారు. చేతబడుల కోసం కొందరు కర్నాటకకు పోయారు. రాష్ట్రం ఎండిపోవాలని చేతబడులు చేయించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారు చేతబడులు చేయిస్తారా? చేతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. మీరు చేసిన చేతబడి మీపైనే తిరగబడుతుంది. మీ చేతబడి మీపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుంది. రాష్ట్రం బాగు కోసం నా సంకల్పం. అందుకే వర్షాలు పడుతున్నాయి'' అని రేవంత్ రెడ్డి అన్నారు.

#Cm Revanth#Telangana#Occult rituals#Kshudra Puja#Rains#Drought#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి