Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఒక్క తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చెన్నై సెంట్రల్‌లో ఆఫీసులకి, కాలేజీలకు సెలవులు ప్రకటించడం ఒక హాట్ టాపిక్. అంతగా, రజినీ మేనియా ఉంటుంది. యంగ్ హీరోలైనా ఒక్కో సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నారు గానీ, మన సూపర్ స్టార్ మాత్రం అసలు గ్యాప్ తీసుకోవడం లేదు.
రజినీకాంత్ లేటెస్ట్ సినిమా జైలర్ 2. ఈ సినిమాకి ముందు వచ్చిన జైలర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో కలెక్షన్ల సునామీని సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. రజినీ మేకోవర్, పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక ఫ్యాన్ బాయ్‌లా రజినీకాంత్ కోసం శ్రమించాడు. కన్నడ సీనియర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఇచ్చిన గెస్ట్ అపీరియన్స్ సినిమాకి మరో హైలెట్.
ఇప్పుడు జైలర్ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జె. సూర్య, మిథూన్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక, రజినీ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా విశ్వరూపం చూపించబోతున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు, జైలర్ 2 డిజిటల్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 160 కోట్లకి జైలర్ 2 డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్నట్టుగా కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం.
రజినీకాంత్ జైలర్ చిత్రాన్ని 100 కోట్లకి డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పుడు, అంతకంటే ఎక్కువ ఆఫర్ తో అమెజాన్ దక్కించుందట. ఇదే, కోలీవుడ్ లో హైయ్యెస్ట్ ఆఫర్ అని కూడా తెలుస్తోంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించడానికి రెడీ అవుతోంది.


