సినిమా

NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

NBK 112: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్‌ని కంట్రోల్ చేసే ఏకైక హీరో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమా బడ్జెట్ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఆయన సినిమా వల్ల నిర్మాత ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదనే గట్టి సంకల్పంతో ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అఖండ 2: తాండవం మాత్రమే 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అంతకముందు వచ్చిన అఖండ 60 నుంచి 70 కోట్లుతో నిర్మించారు. ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వాస్తవానికి, ఈ నెలలో షూటింగ్ కూడా మొదలవ్వాల్సింది. కానీ, తాజా సమాచారం మేరకు, ఇప్పుడీ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి, కారణం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే రెమ్యునరేషన్ కాకుండానే 150 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. ఈ బడ్జెట్ పెట్టొద్దనే బాలయ్య ఆపేయమన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే 111 తెరకెక్కుతోంది. వీరి కాంబినేషన్‌లో వీర సింహారెడ్డి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు, ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. అయితే, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమాకి ముందు అనుకున్న కథ ప్రకారం 200 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. ఇది, తెలిసి అంత బడ్జెట్ అవసరం లేదని, ఆ కథనే పక్కనపెట్టి 100 కోట్ల లోపు పూర్తయ్యే కథతో సినిమాను చేస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇప్పుడు, కొరటాల శివ తో చేయబోయో ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ఇదేనట. కొరటాల ఇచ్చిన బడ్జెట్ ప్రకారం 150 కోట్ల వరకూ అవుతుందట. అందుకే, ఇంత బడ్జెట్‌తో సినిమా వద్దని, వేరే కథ ఉంటే చేద్దాం..లేదంటే ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేద్దాం.. అని బాలయ్య నిర్మొహమాటంగా దర్శకుడు కొరటాల శివతో చెప్పినట్టుగా తాజా వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదే, నిజమైతే నిర్మాతను కాపాడే విషయంలో బాలయ్య ఖచ్చితంగా హీరోనే.

#nandamuribalakrishna#nbk112#koratala siva#balakrishna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి