తెలంగాణ

Cm Revanth: వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షలు చేయండి, లేదంటే నష్టమే- SIRపై నేతలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK•••3 నిమిషాల పఠనం

Cm Revanth: SIR ప్రక్రియలో భాగంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవల్ వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

రెండు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందే అని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఇంచార్జులు 4 రోజులు నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందే అని స్పష్టం చేశారు. టీపీసీసీ జూమ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకపోతే పార్టీ ఉపేక్షించదని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఇవి ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలు అని పేర్కొన్నారు. పకడ్బందీ కార్యాచరణతో వెళ్లకపోతే భవిష్యత్ లో రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ హెచ్చరించారు. SIR లో సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్లండి అని నాయకులకు దిశానిర్దేశం చేశారాయన.

#Cm Revanth Reddy#Telangana Congress#SIR#Votes#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి