Sampath Nandi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక, రచయితగా, నిర్మాతగా సంపత్ నందికి ఓ మార్క్ అండ్ బ్రాండ్ ఉంది. 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడిగా మారిన సంపత్ నంది రెండవ సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమన్నాలతో తీశాడు. 'రచ్చ' పేరుతో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. కథ-కథనాలను తయారు చేయడంలో సంపత్ నంది స్టైలే వేరు.
సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా ఈ నెల 14న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఎస్‌డిఎల్‌పి అధికారిక నిర్మాణ సంస్థతో కలసి సంపత్ నంది ఈ సినిమాను చేయబోతున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా కావడం విశేషం. ఇక, ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజు ఇందులో నటించే హీరోహీరోయిన్స్, ఇతర టెక్నీషియన్స్ తో పాటు షూటింగ్ అప్‌డేట్స్ కూడా తెలపబోతున్నారు.
ప్రస్తుతం, సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా 'భోగి' అనే సినిమా తెరకెక్కుతోంది. దాదాపు, ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ పీరియడ్ యాక్షన్ డ్రామాగా, ఈ సినిమాను సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, కె.కె. రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇక, ఈ సినిమా మేకింగ్ నచ్చి హీరో శర్వానంద్ మరో సినిమాను సంపన్ నందితో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఆగస్టు 14న ప్రారంభమయ్యేప్రాజెక్ట్‌లో హీరో శర్వానంద్ కన్‌ఫర్మ్ అయ్యాడా లేక కొత్త హీరోను సెలెక్ట్ చేశాడా అనేది మరికొన్ని గంటల్లో తెలిస్పోతుంది. శర్వా మాత్రం గ్యారెంటీగా శంపత్ నందితో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.


