National

India: అంబులెన్స్‌కు కొత్త రూల్స్ విధించిన ఎన్‌హెచ్‌ఏఐ!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

భారత జాతీయ రహదారుల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే లపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ప్రమాద వార్త తెలిసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలని గడువు విధించింది.

ఈ భూమి మీద ప్రాణం కంటే విలువైంది ఏది లేదు. సర్వం కోల్పోయిన తిరిగి సంపాదించే అవకాశం ఉంది.. ఒక్క ప్రాణం తప్ప.. అందుకే ఏదైనా ప్రమాదం జరిగిన క్షణంలో రోగి ప్రాణాలు కాపాడటానికి ప్రతి ఒక్క సెకండ్‌ కూడా ఎంతో కీలకం అంటారు వైద్యులు.. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి కొన్ని నిమిషాల్లో సరైన వైద్య సహాయం అందితే ప్రాణాపాయ పరిస్థితిని నివారించే అవకాశం పెరుగుతుందని చెబుతారు.

అందుకే తాజాగా భారత జాతీయ రహదారుల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే లపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ప్రమాద వార్త తెలిసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలని గడువు విధించింది. ఒకవేళ సమయం పాటించడంలో విఫలమైతే ప్రతి ఘటనకు రూ.10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మరోవైపు, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వేగంగా వైద్యం అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రమాద స్థలం అంబులెన్స్‌ పరిధిలోని 10 కిలోమీటర్లలో ఉంటే, తాజా నిబంధనల ప్రకారం 10 నిమిషాల్లోపు అంబులెన్స్‌ అక్కడికి చేరుకోవాలి. 10 కిలోమీటర్లకు మించి దూరం ఉంటే, అందుకు అనుగుణంగా అదనపు సమయం కేటాయిస్తారు.

అంబులెన్స్‌ చేరుకున్న సమయం, ప్రయాణ వివరాలను GPS డేటా, NHAI Care Dashboard ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రమాదానికి సంబంధించిన కాల్‌ అందిన సమయం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలి. ఈ విషయంలో ఆలస్యం జరిగితే రూ.10 వేల జరిమానా విధిస్తారు. అదేవిధంగా అత్యవసర కాల్‌ను అంబులెన్స్‌ సిబ్బంది తిరస్కరించినా, అంబులెన్స్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వైద్య పరికరాలు, మందులు లేదా సిబ్బంది అందుబాటులో లేకపోయినా రూ.10 వేల పెనాల్టీ విధించేలా నిబంధనలు రూపొందించారు.

మరోవైపు ఎన్‌హెచ్‌ఏఐ ఈ కొత్త రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోని 50 కి.మీ హైవేల నెట్‌వర్క్‌లో సుమారు 3 వేల అంబులెన్స్‌లు, 1,000 క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే AIS-140 ప్రమాణాలతో కూడిన GPS పరికరాలను వీటిన్నింటికీ అమర్చారు. ప్రతి వాహనానికి IoT సిమ్‌తో కూడిన ప్రత్యేక ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ను సైతం అందించారు. ఇకపై రోడ్డు ప్రమాదాలకు గురైనవారు 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సాయం పొందవచ్చని అధికారులు తెలియచేస్తున్నారు..

#India#new regulations#NHAI#National Highways#Care Dashboard#ambulances
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి