సినిమా

Ravi Teja: 'ఇరుముడి' టైటిల్ వివాదం..రిలీజ్ ముందు మార్చేస్తారా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Ravi Teja: కొన్ని సినిమాల విషయంలో అనవసరమైన చర్చలు, ఫలితంగా సీన్ కట్ చేయడం లేదా టైటిల్‌ పై అభ్యంతరాలు, ఆలయాల గురించి చూపించినప్పుడు కనిపించే లోపాలు..బయోపిక్స్ అయితే, అనవసరమైన కల్పితాలు వంటివి చోటు చేసుకొని ట్రైలర్ రిలీజ్ తర్వాత కొత్త వివాదాలు తలెత్తుతాయి. దాంతో, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు చేర్పులు చేస్తుంటారు.

Ravi Teja: కొన్ని సినిమాల విషయంలో అనవసరమైన చర్చలు, ఫలితంగా సీన్ కట్ చేయడం లేదా టైటిల్‌ పై అభ్యంతరాలు, ఆలయాల గురించి చూపించినప్పుడు కనిపించే లోపాలు..బయోపిక్స్ అయితే, అనవసరమైన కల్పితాలు వంటివి చోటు చేసుకొని ట్రైలర్ రిలీజ్ తర్వాత కొత్త వివాదాలు తలెత్తుతాయి. దాంతో, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు చేర్పులు చేస్తుంటారు.

ఇరుముడి సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో ఉన్న యాక్షన్ సీన్స్, మర్డర్ మిస్టరీ సీన్స్ చూసి ఇప్పుడు టైటిల్ విషయంలో కొత్తగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో టైటిల్ ఎందుకు ఇరుముడి పెట్టారు. త్రిముడి అని పెట్టుకోవచ్చు కదా అంటూ కామెట్స్ చేస్తున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్నా కూడా కొన్ని సన్నివేశాలు చూసేందుకు అభ్యంతరంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరి, విడుదల ముందు టైటిల్ మార్చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఇది. ఆగస్టు 21న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం భీమవరంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. భీమవరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ నటించింది. కీలక పాత్రలో బేబీ నక్షత్ర కనిపించబోతోంది.

మరి, అయ్యప్ప భక్తులు తెలిపిన అభ్యంతరాల ప్రకారం రిలీజ్ ముందు వరకూ వివాదం ముదిరితే ఇరుముడి టైటిల్ ని మార్చేస్తారనే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా, తాజాగా వచ్చిన ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు సినిమా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. గత కొంతకాలంగా రవితేజకి హిట్ పడలేదు. ఈ సినిమాతో గ్యారెంటీ హిట్ అందుకుంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#raviteja#irumudi#shivanirvana#priyabhavanishankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి