అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులకు షాక్ ఇచ్చారు. ఇండియా నుంచి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్..ఇటీవలి కాలంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ చేతులకు సంకెళ్లు వేయించి మరీ స్వదేశానికి తిప్పి పంపిన విషయం తెలిసిందే. దీనికి తోడు స్థానిక సిటిజన్స్ ఉద్యోగాలను భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపించారు.
అమెరికన్ ప్రజలు,భారతీయుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇక భారతీయ టెకీలకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు పెద్దఎత్తున జరిమానాలు విధించడం, నైపుణ్యాలు కలిగిన ఇండియన్స్‌ను నియమించుకోవాలంటే సదరు కంపెనీలు ముందుగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలంటూ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా, స్థానికులకు పెద్దఎత్తున అమెరికన్ కంపెనీలు జాబ్స్ ఇవ్వాలని, విదేశీయులకు ఇవ్వొద్దని ఆర్డినెన్సులు సైతం పాస్ చేశారు.
తీరా అమెరికన్ కోర్టుల జోక్యంతో ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇదిలాఉండగా, విద్యార్థులకు హెచ్ 1 బీ వీసాలు రద్దు చేయడం, వాటి పునరుద్ధరణపైనా ఆంక్షలు పెట్టారు. దీంతో చాలా మంది హెచ్ 1 బీ కింద పనిచేస్తున్న భారతీయ, ఇతర విదేశీ విద్యార్థులు తమ దేశాలకు వెళ్లే ప్రయాణాలను సైతం మానుకున్నారు.ఎందుకంటే అమెరికా దాటాక మళ్లీ వీసా పునరుద్ధరించాలంటే స్వదేశంలో మళ్లీ ఇంటర్వ్యూ, స్టాంపింగ్ కు చాలా సమయం కేటాయించారు. అలాగే.. గ్రీన్ కార్డు ఉన్నవారు అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ కాదని భయాందోళనకు గురిచేసే స్టేట్మెంట్స్ చేశారు. ఇకమీదట అమెరికాలో ఎవరైన విదేశీ మహిళలు బిడ్డలకు జన్మనిస్తే వారికి పుట్టుకతో వచ్చే సిటిజన్ షిప్ రాకుండా కీలక చర్యలు చేపట్టారు.
కేవలం పిల్లలను కనేందుకే ‘బర్త్ టూరిజం’ పేరిట వస్తున్నారని గుర్తించిన ట్రంప్ సర్కార్.. జులై 9 నుంచి ఇప్పటివరకు 600 మంది గర్భిణీల వీసాలు రద్దు చేసినట్టు తెలసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్టు యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాగా, వీరిలో భారతీయ మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












