తెలంగాణ రాజకీయాల్లో బదిలీల సెగ రాజుకుంది! బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి బదిలీ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నాయి.
ప్రవీణ్ కుమార్ సతీమణిని మార్కెటింగ్ శాఖ నుంచి ఈ రోజు ప్రభుత్వం బదిలీ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏడాదిలో రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులను బదిలీ చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. కావాలనే ఆమెను టార్గెట్ చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు.
కనీసం జీతం కూడా రాని శాఖకు బదిలీ చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏంటని నిలదీశారు. ప్రవీణ్ కుమార్‌పై ఉన్న రాజకీయ కక్షతో, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు మంత్రి శ్రీధర్ బాబు సతీమణి విషయంలో ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా? అంటూ హరీష్ రావు నిలదీశాడు. మొత్తానికి ఈ బదిలీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు తెరలేపింది!












