సుదీర్ఘ విరామం తర్వాత సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమా టీమ్‌తో పాటు సమంతకు అక్కినేని అఖిల్ విషెస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో అఖిల్ ‘మా ఇంటి బంగారం’ సినిమాపై స్పందించారు. మూవీ ప్రమోషన్స్ బిజీలో ఉండి తాను ఇంకా మా ఇంటి బంగారం సినిమా చూడలేదని, అయితే ట్రైలర్ చూశానని తెలిపారు. తనకు చాలా నచ్చిందని చెప్పారు.
సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. సహజంగా అనిపించింది. మంచి ఇంటి కోడలిగా వెళ్లి వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు, పవర్ ఫుల్ యాక్షన్ చూపించడం ఆసక్తికరంగా ఉందని తెలిపారు. ‘కంగ్రాట్స్ సామ్..’ అంటూ సమంతతో పాటు మూనీ యూనిట్‌కు విషెస్ తెలిపాడు. కాగా, అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈనెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది.












