అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేని అంత్యక్రియలకు అంతా సిద్ధమైంది. ఆయన హత్య జరిగిన ప్రదేశం టెహ్రాన్‌కు అక్కడి అధికారులు శవపేటికను తరలించారు. తమ ప్రియతమ నేతను చూసేందుకు పెద్దఎత్తున ఇరాన్ ప్రజలు అక్కడకు చేరుకున్నారు..టెహ్రాన్ వీధులన్నీ వారి రోదనలతో మిన్నంటాయి. అంత్యక్రియలు వారం పాటు జరుగుతాయని తెలుస్తోంది.
అయితే, ఖమేనీ అంత్యక్రియలకు ప్రపంచదేశాధినేతలు హాజరవుతారని సమాచారం.ఈకార్యక్రమానికి రావాలని భారత ప్రధాని మోడీకి సైతం ఇరాన్ విదేశాంగ శాఖ ఆహ్వానం పంపగా.. భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ పాల్గొంటారని సమాచారం. ఇదిలాఉండగా, పశ్చిమాసియాలో ఇరాన్ అణుకార్యక్రమాలు చేపడుతున్నదని యూఎస్, ఇజ్రాయెల్ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఖమేని మరణించిన విషయం తెలిసిందే. నాటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.ఇటీవల సీజ్ ఫైర్ మీద ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదరడంలో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నాయి.












