టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ తన గత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు. ఈక్రమంలో హీరో విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం నిర్మాతగా కొనసాగిన అభిషేక్ నామ తాజాగా ‘నాగబంధం’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకు తాను ఏపీ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించానని, అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు భారీగా నష్టపోయానని తెలిపారు.
అయినప్పటికీ తాము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదని చెప్పారు. తనకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తన బ్యానర్‌లో మరో సినిమా చేస్తారని ఆశించామని తెలిపారు. దానికోసం ఏకంగా మూడేళ్ల పాటు ఎదురుచూసినా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అభిషేక్ నామ తన ఆవేదనను పంచుకున్నారు.












