క్రైమ్

Breaking : రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదేనా?

రచన: Desk 12 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకివచ్చింది.

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట చెందిన దంపతులు రవికుమార్, శిరీష దంపతులు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. వీరి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామం అని తెలిసింది.

గురువారం రాత్రి ఘట్‌కేసర్ నుంచి బీబీనగర్ వైపు వెళ్లే రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్‌సీ సమీపంలో రైలు కిందపడి రవికుమార్, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇంకేమైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

#couples#suicide#ghatkesar#railwaystation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి