రాజకీయాలు

Bandisanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బిగ్‌బాస్ షో..

రచన: Desk 13 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కేంద్రహోం సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని బాంబ్ పేల్చారు. శుక్రవారం కరీంనగర్‌లో

రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కేంద్రహోం సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని బాంబ్ పేల్చారు. శుక్రవారం కరీంనగర్‌లో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల మధ్య బిగ్‌బాస్ షో నడుస్తోందని సెటైర్లు వేశారు.ప్రజలు చాలా విజ్ఞులని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎలిమినేట్ చేసి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో జరగుతున్న పొలిటికల్ ‘బిగ్‌బాస్‌ షో’ను చూస్తూ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని.. వారిని డిస్ట్రబ్ చేయకుండా పార్టీ పరంగా అధికారంలోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టామని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో అర్ధమైందని.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అవినీతి పాల్పడిన కేసీఆర్ కుంటుంబంలో ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భార్యభర్తల ఫోన్లు విన్నారని చెప్పిన సీఎం రేవంత్ .. సిట్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని, వాళ్ల అవినీతి బండారాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనించారని, ఇక ముందు వాళ్ల ఆటలు సాగవని బండి సంజయ్ అన్నారు.

#bandisanjay#congress#brs#politicalgame#biggboss show
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి