తెలంగాణ

‘పూటకో మాట.. రోజుకో అడ్రస్’

రచన: Desk 25 నిమిషాల పఠనం

మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి జూపల్లి లేఖ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే సంగారెడ్డిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆధారాలను ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూపల్లి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూనే, ఆయనకు దిమ్మతిరిగేలా ప్రతి సవాల్ విసిరారు.

  • చర్చకు రాకుండా తోక ముడిచారు!

  • కాంగ్రెస్ లెక్కలకు, RBI లెక్కలకు పొంతన లేదు

  • అప్పులపై మాకు స్పష్టత ఉంది

  • బీఆర్ఎస్ చేసింది రూ.4.17లక్షల కోట్లే!

  • మంత్రి జూపల్లి సవాల్‌కు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్!

  • పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో వివరాల వెల్లడి

  • చీము, నెత్తురు ఉంటే జూపల్లి రాజీనామా చేయాలని డిమాండ్

మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి జూపల్లి లేఖ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే సంగారెడ్డిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆధారాలను ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూపల్లి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూనే, ఆయనకు దిమ్మతిరిగేలా ప్రతి సవాల్ విసిరారు.

"మొన్న తెలంగాణ భవన్ అన్నారు, నిన్న గన్ పార్క్ అన్నారు, నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటున్నారు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ మారుస్తూ జూపల్లి తోక ముడిచారు. నిన్న గన్ పార్క్‌కు వస్తానని చెప్తే పోలీసులను పెట్టి నన్ను అరెస్ట్ చేయించారు. కనీసం అక్కడికైనా చర్చకు రమ్మంటే రాలేదు" అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అదేవిధంగా కేటీఆర్, హరీశ్ రావు రావాలన్న జూపల్లి, ఇప్పుడు మాట మార్చి కేసీఆర్ వస్తేనే వస్తానని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీనియర్ మంత్రిని అని చెప్పుకునే జూపల్లి.. చర్చ నుంచి పారిపోవడానికే ఇలాంటి సాకులు వెతుకుతున్నారంటూ విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లెక్కలకు అస్సలు పొంతన లేదని హరీశ్ రావు ఆధారాలతో సహా నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏండ్లలో చేసిన అప్పు 1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు లక్షా 86 వేల 67 కోట్లు అని చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తాము చేసిన అప్పు 3,47,294 కోట్లు అని చెప్పారని నెలకో లెక్క చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? తప్పుడు లెక్కలు చెప్పినందుకు పాలమూరు బిడ్డగా జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి" అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము ఎప్పుడూ స్పష్టతతోనే ఉన్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు. తాము చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమేనని గతంలోనే క్యాబినెట్ మొత్తాన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ చెప్పానని గుర్తుచేశారు.

#harishrao#brs#jupallikrishnarao#harishrao counter to jupally#telangana politics#kcr#brsloans
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి