సర్కార్ లో సత్తా కరువు?
ఫవర్ అంతా ప్రైవేట్ సైన్యంలోనే ?
సినిమా మంత్రికి టికెట్ల పెంపు తెలియదు ?
దేవాదాయ శాఖ మంత్రికి యాదాద్రి ట్రస్టు సభ్యుల సమాచారం లేదు. ?
ప్రయివేట్ గా ఒక్కొక్క డిపార్మెంట్ ని ఒక్కొక్కరు వ్రాసుకున్న వైనం.
బీఆర్ఎస్ హయంలో కనీసం ప్రజాప్రతినిధి అయి ఉండేది. ?
ఇప్పుడంతా ఏ అధికారం లేకుండానే అధిపత్యం ?
అసలు వీళ్లంతా ఎవ్వరని ప్రశ్నిస్తున్న కమిట్మెంట్ అధికారులు.?
బదిలీల భయంతో కుక్కిన పేనులా పనులు చేస్తున్న ఆఫీసర్స్.
ఈ కొత్త కల్చర్ పై 2 ఏండ్లుగా ఓపిగ్గా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు
వాళ్లు చెప్పింది చేసుకుంటూ వెళ్లుతున్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లు .
కొండ సురేఖ క్యాబినెట్ కి హజరు కాకపోవడంతో తెర పైకి అనుమానాలు.
బై
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
9848070809.
స్వేచ్ఛ ఛైర్మన్ స్టోరీ
తమ డిపార్మెంట్లలో వేలు పెడుతున్న ప్రైవేట్ సైన్యం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. మంత్రులను నడిపించే సత్తా పొలిటికల్ గా, పబ్లిక్ లీడర్స్ గా ఏలాంటి అనుభవం లేని వ్యక్తులు నడిపించడం పై అనేక మార్లు దుమారం చెలరేగుతుంది. పార్టీలో సేవ చేస్తే కార్పోరేషన్ పదవులైనా ఇచ్చి పాలనలో భాగస్వామ్యం చేయాలి. కాని కాంగ్రెస్ సర్కార్ లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు చెప్పితేనే పెద్ద పెద్ద డిపార్మెంట్ ల్లో పనులు కావడాన్ని సొంత డిపార్మెంట్ లో అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు. వాళ్ల పెత్తనం ఏంటని గుసగుసలతో విసుగ్గుంటున్నారు. రూల్స్ , యాక్ట్ తెలియకుండానే చెప్పిందల్లా చేయాల్సిందే అన్నట్లుగా వ్యవహారించడంతో అసలు వీళ్లకు ఏం పని అంటూ సన్నిహితులతో చెప్పకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా పనులు చేస్తే ఆ తర్వాత చిప్పకూడా తినాల్సి వస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. చేయకపోతే అసలు పొస్గింగ్ ఉండదనే భయంతో నాన్చల్సి వస్తుందని చెప్పుతున్నారు. అదే అవినీతి అధికారుల అయితే ఎప్పుడు ప్రైవేట్ సైన్యం నుంచి ఫోన్ వస్తుందా ? ఏలా దండుకుందామా అనే రీతిలో రంగారెడ్డి , మేడ్చల్ జిల్లా కొంత మంది అధికారులు ఉన్నారు. అవినీతి అధికారుల తీరు పై కొన్ని స్వచ్చంద సంస్థలు పేర్లు సేకరిస్తున్నాయి. గతంలో అమోయ్ కుమార్ చేసినట్లు తప్పులు చేస్తున్నారు. ఆ దందాలే కొనసాగింపుగా చేస్తుండటం పై ఎన్నో కేసులు కోర్టుకు చేరుతున్నాయి.
పంచుకున్న ప్రైవేట్ వ్యక్తులు ?
రాజకీయంగా ఎదగడానికి ఎంతో మంది సహాయ సహాకారాలు చేస్తారు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రక్ట్స్ ఇస్తారు. ఎదైనా ఒక్కటి రెండు మేలు జరిగే పనులు చేసి పెడుతారు. ఐదేళ్లు వాళ్ళు బిజినెస్ చేసుకునేలా అవకాశాలు కల్పిస్తారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా కొన్ని శాఖల్లో కనీసం ఒక్క కౌన్సలర్ కూడా కాని వాళ్లు, పార్టీకి ఒక రోజు కూడా పని చేయని వారు. అధికారులను పాలిస్తున్నారు. మేలు చేశామనే అర్హతతో మున్సిపల్ శాఖలో ఓ బిల్డర్, రెవెన్యూలో ఇద్దరు సోదరులు, విద్యాశాఖలో సినియర్ మాజీ మంత్రి కుటుంబం. ఫవర్ డిపార్మెంట్ ఒక్కరు, దేవాదాయ శాఖ మరోక్కరు, టూరిజం శాఖలో ఇంకొక్కరు సినిమా శాఖాలో సన్నిహితులు ఇలా అనేక మంది ప్రయివేట్ వ్యక్తులు సీఎంవో పేరుతో జోక్యం చేసుకోవడం నేరుగా సీఎంతోనే మంత్రులకు తెలియకుండా ఆర్డర్స్ తెప్పించుకోవడం కలవర పెడుతుంది. కొండ సురేఖ క్యాబినెట్ మీటింగ్ కు రాకపోవడం అలకనేనని సన్నిహితులు చెప్పుతున్నారు. ఎందో వంకతో మంత్రుల శాఖలో జొక్యం చేసుకుని మంత్రి పై ఒత్తిడి తెచ్చి ఆ శాఖలో పట్టు సాధిస్తున్న వారు రోజు రోజుకు పెరిగిపోవడంతో గ్యాప్ క్రియేట్ అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి దూరం పెట్టినా ? అధికారుల పై హావా ?
చాలా సందర్బాల్లో ప్రైవేట్ సైన్యం ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని చేస్తున్న దందాల పై ఇంటలిజెన్స్ నివేదికలు తయారు చేస్తుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు వారి దందా పై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం, అధారాలతో కొన్ని పనులపై సీఎం హెచ్చరించినట్లు సమాచారం. పనులు చేయరాకపోతే మూసుకొని కూర్చోవాలి. బద్నం చేయవద్దని చెప్పినా మళ్లీ ఇన్వాల్ అయి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను మందలించినా మళ్లీ ఛాన్స్ రాదంటూ విచ్చల విడితనం పెరిగిపోయిందని నిఘా వర్గాలు సమాచారం సేకరించారు. భూముల పైనే వాళ్ల చూపు ఉండటం, అక్రమంగా స్వాధీనం చేసుకుని నిర్మాణాలు చేయడం లాంటివి ప్రతి నిత్యం జరగడంతో సీఎం మందలించినా కొనసాగుతున్నాయనే అరోపణలు ఉన్నాయి.












