స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

ఆబ్కారీ బదిలీల్లో అవినీతిదే అధిపత్యం..!

రచన: Desk 39 నిమిషాల పఠనం

ఇటీవల కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో పని చేస్తున్న వారు బదిలీల్లో చక్రం తిప్పి భారీగా వసూళ్లు చేస్తున్నారు. అందుకు స్టాంప్స్​‍ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో బట్టబయలు అయింది. వెంటనే ఐజీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఎక్సైజ్‌ శాఖలో మంత్రి ఓఎస్డీ అయిన రిటైర్డ్‍ అధికారి రాజేశ్వర్‌ రావు బదిలీల పేర్లతో చేసిన అవినీతి పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోకస్ చేయడం లేదు.

  • రిజిస్ట్రేషన్‌ శాఖ తీరుపై ఆ మంత్రి సీరియస్ ?

  • మరి ఎక్సైజ్‌ శాఖ బదిలీల్లో లంచాలపై దర్యాప్తు ఏదీ ?

  • 10 రోజులు ఉత్తర్వులు ఆపి వసూళ్ల పర్వానికి తెరలేపిన ఓఎస్డీ ?

  • 1977లో ఎస్టీ అని ఎస్సైగా రాజేశ్వర్‌ రావు జాయినింగ్‌. ?

  • కెటిఆర్‌ మామలా ఓసీ పేరుతో ఎక్సైజ్‌ శాఖలో చక్రం తిప్పిన వైనం ?

  • హరీష్‌ అనుచరుడిగా పద్మారావు వద్ద దందాలు ?

  • ఆ తర్వాత ఎర్రెబెల్లి వద్ద ఎలగబెట్టిన కులం కార్డు ?

  • ఎక్కడ ఎలా సంపాదించాలో తెలిసిన వాడిగా జూపల్లి దగ్గర మళ్లీ ఓఎస్డీగా చేరిక?

  • టూరిజం శాఖ విషయాలు కూడా ప్రతిపక్షాలకు లీక్‌ చేస్తోంది ఇతనేనా ?

  • పాతవాళ్లు వద్దన్నా జూపల్లి మంత్రి ఓఎస్డీగా వచ్చింది వసూళ్ల వ్యవహారం కోసమేనా ?

  • 20 ఫోస్టుల్లో ఒక్కొక్కరి వద్ద రూ.40 లక్షల వరకు వసూళ్లు ?

  • ఫోకల్‌లో చేసిన వారికి మళ్లీ ఫోకల్‌ పోస్టింగ్స్​‍ ట్రాన్స్​‍ఫర్‌ చేయించారు ?

  • ఎవ్వరి మాట వినకుండా తన శిష్యరికాన్నే పెంచి పోషించిన రాజేశ్వర్‌ రావు ?

  • మల్లారెడ్డిపై ఏసీబీ దాడులతో బట్టబయలు. ?

  • త్వరలో జరగబోయే ఎస్ఐ, సీఐ, ఏఈఎస్ బదీలీల్లో కూడా లక్షల్లో వసూళ్లకు స్కెచ్‌?

స్వేచ్ఛ ఛైర్మన్‌

దేవేందర్‌ రెడ్డి డెస్క్

ఇటీవల కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో పని చేస్తున్న వారు బదిలీల్లో చక్రం తిప్పి భారీగా వసూళ్లు చేస్తున్నారు. అందుకు స్టాంప్స్​‍ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో బట్టబయలు అయింది. వెంటనే ఐజీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఎక్సైజ్‌ శాఖలో మంత్రి ఓఎస్డీ అయిన రిటైర్డ్‍ అధికారి రాజేశ్వర్‌ రావు బదిలీల పేర్లతో చేసిన అవినీతి పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోకస్ చేయడం లేదు. అంతకు ముందు ఆయన అంతా శాఖను ఎలా పెంచి పోషించారో, మంత్రికి కూడా తెలియకుండా ఎలా చేశారో ఆ శాఖలో పనిచేస్తున్న వారికే బాగా తెలుసు. 2013లో రిటైర్డ్‍ అయినా, తెలంగాణ వచ్చాక 2015 వరకు జీతాలు పొందేలా ఫైరవీ చేసిన ఘనకార్యుడు ఆయన. ఇలాంటి వ్యక్తిపై అనేక అరోపణలతో మరోసారి ప్రభుత్వం చేపట్టిన బిఆర్‌ఎస్ మళ్లీ ఎక్సైజ్‌ శాఖలో తీసుకోలేదు. కానీ, హరీష్‌ రావు మనిషిగా ఆయనకు పేరు ఉండడంతో కులం ఫీలింగ్‌లో ఎర్రబెల్లి వద్ద కొన్ని రోజులు పనిచేసినా ఆయన్ను అక్కడి నుంచి తొలగించారు. కానీ, అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఒత్తిడి వచ్చినా రాజేశ్వర్‌ రావు గురించి తెలిసి తన పేషీలో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తీసుకోలేదని టాక్‌.

ఇటీవల బదిలీల్లో 10 కోట్ల బిజినెస్

బెల్ట్ షాపులు, గంజాయి సరఫరా, గుడుంబా దందా, తాటి కళ్లుపై నిఘా ఇలా మత్తు పదార్ధాల పై అధికారం ఉండే ఎక్సైజ్‌ శాఖలో అన్నింటికి గేట్లు తెరిచి నడుస్తున్న బిజినెస్పై అధికారులు నుంచి ఈ అధికారి భారీగా సంపాదిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ కమిషనర్‌ , అసిస్టెంట్‌ కమిషనర్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బదిలీల్లో కమిషనర్‌ హరికిరణ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు పంపిన జాబాతాను మంత్రి అమోదించాలి. కానీ మంత్రికి చేరకుండా 10 రోజులు 30 మంది అధికారులకు కీ ఫోస్టుల్లో చక్రం తిప్పి, ఎస్సీ అధికారులకు ఒక్క పోస్టింగ్‌ ఇవ్వకుండా ఈ అధికారి చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన శిష్యరికంలో ఉన్న ముగ్గురు అధికారుల ద్వారా ముడుపులు వసూళ్లు చేసి డబ్బులు ఇచ్చిన వారికే ఫోస్టింగ్‌లు కట్టబెట్టారన్న టాక్‌ వినిపిస్తున్నాయి. ఈ ఫోస్టింగ్‌ల్లో భాగంగా ఫోకల్‌ పోస్టింగ్‌లో చేస్తున్న వారికే మళ్లీ ఫోకల్‌ గా పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు క్యూర్‌ పరిధిలోనే వారికి ఫోస్టింగ్‌లు ఇచ్చి ముడుపుల బాగోతానికి తెర లేపారు. స్పీకర్‌ తన వర్గానికి చెందిన ముగ్గురికి తగిన ఫోస్టులు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా పైసలు ఇచ్చిన వారికే ఇవ్వడం పై సిఎం వద్దకు ఈ ఇష్యూ వెళ్లడంతో శాఖలో చర్చనీయాంశం అయ్యింది. ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ అంజన్‌ రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రదీప్‌ రావుతో పాటు గ్రేటర్‌ పరిధిలో డిసిగా బదిలీ అయిన అధికారితో కలిసి రాజేశ్వర్‌ రావు ఈ ముడుపుల వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తుంది.

నెక్ట్స్​‍ టార్గెట్‌ సిఐలు. ఎస్సైలు

ఎక్సైజ్‌ శాఖలో త్వరలో ఏఈఎస్లు, సీఐలు, ఎస్ఐల బదిలీలు భారీగా ఉండనున్నాయి. వీటిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. కానీ, మంత్రి ఓఎస్డీనే ఈ పోస్టుల కోసం లక్షల్లో మాట్లాడుకొని చక్రం తిప్పుతున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి.

ఏం జరిగిందంటే?

14 మంది డిసి (డిప్యూటీ కమిషనర్‌)లకు, 19 మంది ఏసి (అసిస్టెంట్‌ కమిషనర్‌)లకు, 35 మంది ఈఎస్ (ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు) పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే, ఈ బదిలీలకు సంబంధించి ఆ శాఖ కమిషనర్‌ ఫోకల్‌ టు నాన్‌ఫోకల్‌, నాన్‌ ఫోకల్‌ టు ఫోకల్‌ కింద బదిలీలు చేయాలని నిర్ణయించి, దానికి సంబంధించి ఫైల్‌ను ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి కమిషనర్‌ పంపారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ కూడా కమిషనర్‌ పంపిన జాబితాలో చిన్న మార్పులు చేసి ఆ ఫైలును సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పంపించగా అక్కడే ఈ జాబితాలో చాలా మార్పులు జరిగాయని, మూడు కమిషనరేట్‌ పరిధిలో ఎస్సీ అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి ఒక రిటైర్డ్‍ అధికారి కుట్రలు చేశారని, దీని వెనుక ఆయన హస్తం ఉందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రాబోయే బదిలీలు ఇవే

ఈ నెలలో జరిగే ఎక్సైజ్‌ ఏఈఎస్లు, సీఐలు, ఎస్ఐల బదిలీల్లోనూ ఈ రిటైర్డ్ అధికారి తన అనుచరులకే క్యూర్‌ పరిధిలో పోస్టింగ్‌లు ఇప్పించడానికి ఇప్పటినుంచే వారితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కొండాపూర్‌, కుత్భుల్లాపూర్‌, శంషాబాద్‌, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్​‍, అమీర్పేట్‌, రాజేంద్రనగర్‌, కూకట్పల్లి, ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమన్గల్‌, షాద్నగర్‌, సంగారెడ్డి పోలీస్స్​టేషన్లలో పోస్టింగ్ల కోసం కొందరు సిఐలు, ఎస్ఐలు ఈ అధికారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఈ పోస్టింగుల్లో మరో రూ.10 కోట్ల వ్యాపారం చేసేలా ప్రైవేట్‌ గా ప్లాన్‌ చేసుకున్నారు.

#ExciseDepartmentScam#JupallyKrishnaRao#OSDRajeshwarRao#TelanganaTransfersCorruption#ACBInquiry
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి