రాజకీయాలు

Kavitha : కవితకు బిగ్‌షాక్.. 15 రోజులే టైమిచ్చిన ఈసీ!

రచన: Desk 13 నిమిషాల పఠనం

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది.ఆమె ప్రకటించిన నూతన రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది.ఆమె ప్రకటించిన నూతన రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తెలంగాణ రక్షణ సేన'(TRS) పేరు మార్చుకోవాలని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికారికంగా లేఖ రాశారు. రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించక పోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

ఇదిలాఉంటే, గతంలో తెలంగాణలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ నేతృత్వంలోని 'తెలంగాణ రాష్ట్ర సమితి' పార్టీ పేరు కూడా 'టీఆర్ఎస్'.. ఆ తర్వాత దానిని భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పేరిట పార్టీ పెట్టడంతో అటు ప్రజలు, వివిధ వర్గాల నుంచి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై బీఆర్ఎస్ సైతం అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్చుకోవాలని సూచిస్తూ లేఖ రాసినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

#Trs cheif kavitha#cec#politics#telangana#brs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి