టాప్ న్యూస్

Midday Meals :టిఫిన్స్, మీల్స్ పెట్టి మమ్మల్ని అవమానిస్తారా?.. టీచర్లు ఫైర్!

రచన: Desk 13 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పాటే టీచర్లు, లెక్చరర్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పాటే టీచర్లు, లెక్చరర్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయని భావించగా.. సర్కారుకు షాక్ తగిలింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.టీచర్లకు బ్రేక్‌ఫాస్ట్,లంచ్ అందించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యావేత్తలు సైతం పెదవి విరుస్తున్నారు.

సర్కార్ నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందంటూ పీఆర్టీయూ (PRTU), ఎస్టీయూటీఎస్ (STUTS) వంటి ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీచర్లను పిల్లలతో సమానంగా చూస్తూ వారికి స్కూళ్లలోనే ఉచిత భోజనం పెట్టాలని సర్కారు భావించడాన్ని వారంతా అవమానకరంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.ఉపాధ్యాయులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అవసరం లేదని వారు స్పష్టంచేశారు.తమపై అనవసరంగా ఇలాంటి పథకాలను రుద్దే బదులు.. చాలా కాలంగా పెండింగ్‌లో జీతాలు, అలవెన్సులు పెంచాలని, పాఠశాలల్లో పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు.

కాగా, దీనిపై టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు ఫ్రీగా భోజనాలు పెట్టడానికి వెచ్చించే నిధులను కూడా వారికే కేటాయించాలన్నారు.తద్వారా పిల్లలకు మరింత మెరుగైన,నాణ్యమైన పోషకాహారం అందుతుందని, టీచర్లపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

#midday meal#breakfast#teachers#oppose#prtu#stuts
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి