రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇటీవల ఓ సభలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండ్రోజుల కిందట టిమ్స్ ఆస్పత్రుల్లో మొత్తం 6వేలకు పైగా పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 5వేల పోస్టులను ప్రకటించింది. దీనికి ఆర్థికశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ వివరాలు విడుదల కానున్నాయి.
పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీచేశారు.5 వేల పోస్టుల్లో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఇక ఎస్ఐ విభాగంలో 148 సివిల్ ఎస్ఐ పోస్టులకూ ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
1. ఎస్సై (సివిల్) - 148
2. ఎస్సై (ఏఆర్) - 12
3. రిజర్వ్ ఎస్సై (టీజీఎస్పీ) - 3
4. ఎస్సై (ఎస్ఏఆర్ సీపీఎల్) - 14
5. ఏఎస్సై (ఎఫ్‌పీబీ) - 23
6. కానిస్టేబుల్ (సివిల్) - 3,697
7. కానిస్టేబుల్ (ఏఆర్) - 1,052
8. కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) - 24
9. కానిస్టేబుల్ (డ్రైవర్ - పీటీవో) - 20
10. కానిస్టేబుల్ (మెకానిక్ - పీటీవో) - 7
మొత్తం పోస్టులు = 5,000












