సామాన్యులే బలి కావాలా ?
ప్రీ లాంచ్ లోనే లాభాలు కొట్టేసిన SAS జీవీరావు.
గోద్రేజ్ ప్రాపర్టీస్ , శ్రీయాస్ లైఫ్ స్పెస్ అదే దారి? .
అందరికి అమ్మింది ఫినిక్స్ బినామి సంస్థనే ,
లబోదిబోమంటున్న చిన్న రియల్టర్స్ , ప్లాట్ ఓనర్స్
2 ఏండ్ల క్రితమే 4 వేలకు స్వేయిర్ ఫీట్ అంటూ వల ?
నేటికి అనుమతి లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫోస్టింగ్స్ ?
స్వేచ్చ చైర్మన్ డెస్క్ 9848070809.
ఐడీఎల్ భూముల్లో అక్రమాలకు పాల్పడి వేల కోట్లు దోచుకున్న ఫినిక్స్ బినామి పేరు సంస్థ అయినా స్వేయిర్ స్పెస్ సంస్థ ఆగమాగం అవుతుంది. ఎకరాల కొద్ది ప్లాటింగ్ చేసి అమ్మకానికి పెట్టిన ఈ సంస్థ ఇప్పుడు హైకోర్టులో వచ్చిన మధ్యంతర తీర్పుతో భవిష్యత్ ఏంటీ అంటూ తిరుగుతున్నారు. కొంత మంది కొనుగోలు చేసిన వారు ప్రీ లాంచ్ పేరుతో SAS, హానర్ హోమ్స్ , గోద్రేజ్ , శ్రీయాస్ లైఫ్ స్పెస్ లాంటి సంస్థలు లాభాల్లో ఉన్నాయి . కాని ఎకరం నుంచి 5 ఎకరాల వరకు కొనుగోలు చేసిన సంస్థలు లబోదిబోమంటున్నారు. మార్కెట్ లేని రోజుల్లో ఈ టెన్షన్ పై అందోళన చెందుతున్నారు.
ఇప్పటికే అందరిని మేనేజ్ చేశామని అనుకుంటున్న ఈ ఫినిక్స్ భూ మాఫియా , ఎంతో మందిని ముంచేసింది. బినామిలైనా బోగి శ్రీధర్ రావు, మురళీదర్ రావులతో ఒక్క చిన్న కంపనీ పెట్టి అందులోకి విదేశీ లోన్స్ ట్రాన్పర్ చేసిన దందా అంతా ఇంతా కాదు. నిర్మాణాలు ప్రారంభం అయినా ప్లాట్ ఓనర్స్ కి అన్నింటిని మేనేజ్ చేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ చేసిన మోసం ఎంటో చూస్తే కొనుగోలు దారులకు భయం వేస్తుంది. ఎవ్వరెవరు ఎక్కడ, ఎలా కొనుగోలు చేశారు. అసలు టైటిల్ ఎవ్వరిది, ఎవ్వరికి ఇచ్చారు. మొత్తం ఇందులో ఉన్న కేసులు ఎంటో మరో కథనంలో చూద్దాం.












