సినిమా

Sriman: ‘నేను తెలుగోడినే.. కానీ తమిళ సినిమాలే ఎక్కువ చేశా’: నటుడి ఎమోషనల్

రచన: Desk 34 నిమిషాల పఠనం

తమిళ సినీ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడినేనని.. కానీ టాలీవుడ్‌లో ఆశించినన్ని అవకాశాలు రాక తమిళ సినిమాలే ఎక్కువ చేశానని ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీమన్ తన ఆవేదనను వెల్లగక్కాడు.

దశాబ్దాలుగా సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు చేసిన నటులు ప్రస్తుతం కనుమరుగవుతున్నారు. సినిమా అవకాశాలు రాక కొందరైతే, ఎక్కువ సినిమా ఛాన్స్‌లు ఎక్కడ ఉంటే అక్కడ సెటిల్ అయిపోతున్నారు మరికొందరు. తమిళ సినీ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు ‘శ్రీమన్’. అయితే, తాను పక్కా తెలుగువాడినేనని.. కానీ టాలీవుడ్‌లో ఆశించినన్ని అవకాశాలు రాక తమిళ సినిమాలే ఎక్కువ చేశానని ఎమోషనల్ అయ్యారు. ఈమేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీమన్ తన ఆవేదనను వెల్లగక్కాడు.

తాను ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా గొల్లాలమామిడాడ. అయితే తనను ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లలో గుర్తుపట్టి చాలా మంది మీరు ఆ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించారు అని చెబుతారే కానీ చివరికి ‘మీ పేరేంటి సార్’ అని అంటుంటారు. ఇన్ని వందల సినిమాలు చేసినా తెలుగు గడ్డ మీద నా పేరు రిజిస్టర్ కాకపోవడం లోపల ఒక వెలితిగా ఉండిపోయింది’ అంటూ శ్రీమన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ అయినా తానే తెలుగులో డబ్బింగ్ చెప్పానని, టాలీవుడ్‌లో నటించి తెలుగు డైలాగులు చెప్పి రెండు మూడేళ్లయిందని చెప్పాడు. ఒక మంచి గుర్తింపు ఉన్న దర్శకుడితో పని చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటునన్నానని ఆ వెలితి అనిల్ రావిపూడి తీర్చాడని ధన్యవాదాలు తెలిపాడు. ఆయన ఇచ్చిన అవకాశం కోసం తమిళంలో నాలుగు సినిమాలు వదులుకుని మరీ తెలుగులో సినిమా చేయాలని వచ్చానని తెలిపాడు. అనిల్ రావిపూడికి కొన్ని వేలసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని, తాను ఎప్పటికీ ‘డైరెక్టర్స్‌ యాక్టర్’గానే ఉంటానని తెలిపారు.

#Sriman#Anilravipudi#TeluguCinema#Kollywood#Tollywood#venkyanil5#nkrar2
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి