రాజకీయాలు

దీదీకి బిగ్ షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు!

రచన: Desk 33 నిమిషాల పఠనం

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో మమతా బెనర్జీ వర్గానికి చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలింది.

ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీతో సహా టాప్ లీడర్లు ఘోర పరాజయం పాలయ్యారు. గెలిచిన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 59 మంది రితబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. మెజారిటీ సంఖ్యాబలం ఉండడంతో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఆయన స్పీకర్ రతిన్ బసును ఆశ్రయించగా, స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో జూన్ 1న రితబ్రతను మమతా బెనర్జీ వర్గం సస్పెండ్ చేసింది.

పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎలా గుర్తిస్తారని, స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని టీఎంసీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అసెంబ్లీ సెక్రటరీ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలమే ముఖ్యమని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు వల్లే స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ వివాదంపై పూర్తి విచారణ జరపాల్సి ఉందన్న జస్టిస్ కృష్ణారావు, తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేస్తూ.. అంతవరకు స్పీకర్ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

#MamataBanerjee#TrinamoolCongress#CalcuttaHighCourt#RitabrataBanerjee#WestBengalAssembly#BengalPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి