ఈపీఎఫ్‌వో సేవలు మొత్తానికి అందుబాటులోకి వచ్చాయి. మొన్నటివరకు ఆన్‌లైన్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.దీంతో చందాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెన్షన్ క్లెయిమ్స్,పీఎఫ్ క్లెయిమ్స్ వంటిసేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. తాజాగా సేవలు మళ్లీ అందుబాటులోకి రావడంతో చందాదారులకు బిగ్ రిలీఫ్ లభించినట్టు అయ్యింది.
అయితే, అదనపు ధ్రువీకరణల వల్ల ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్స్, పాస్ బుక్ అప్డేట్ ప్రాసెసింగ్ కోసం రెండు వారాల టైం పట్టొచ్చు అని ఈపీఎఫ్‌వో తెలిపింది. సేవలు అప్డేట్ చేయడం వల్లే ఆన్లైన్ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అప్‌గ్రేడ్ తర్వాత ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో యూఏఎన్ యాక్టివేషన్, డైరెక్ట్ యూఏఎన్ కేటాయింపులను ఉమంగ్ (UMANG) యాప్ కు మార్చారు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగతా సేవలు పోర్టల్ లో యథావిధిగా అందుబాటులో ఉన్నాయి.












