అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బెల్జియం దేశం నుంచి అదిరిపోయే బహుమానం అందింది. అమెరికా 250వ స్వాతంత్య్రోత్సవం సందర్భంగా బెల్జియంకు చెందిన వజ్రాల పరిశ్రమ...అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఓ అరుదైన బహుమతి అందజేసింది. 321 వజ్రాలు, 56 రత్నాలు, పచ్చలు పొదిగిన బంగారు ఉంగరాన్ని ఆయనకు పంపించింది.
ట్రంప్ పేరును సూచించే టి అక్షరం, అమెరికా పతాకంలోని నక్షత్రాలు, ప్రత్యేకంగా గీసిన చారలు ప్రముఖంగా కనిపించేలా ఈ ఉంగరాన్ని రూపొందించారు. వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన యాంట్వెర్ప్ నగరంలో ఉంగరం తయారైనట్టు తెలుస్తోంది.‘‘ఈ అమూల్య ఉంగరాన్ని బహూకరించిన నా యాంట్వెర్ప్ మిత్రులకు కృతజ్ఞతలు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇదిలాఉండగా అమెరికా, ఇరాన్‌తో పీస్ డీల్ సైన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.












