తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలైనా గడువక ముందే అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష డీఎంకే కుట్రలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సీఎం విజయ్‌ను గద్దె దించడానికి టీవీకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి ప్రభుత్వానికి మద్దతు విరమింపజేయాలని కుట్రలు జరిగినట్టు తెలుస్తోంది.
టీవీకే పార్టీకి ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఐయూఎంఎల్, డీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ సీఎం అయ్యారు.అయితే, ఆయన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష డీఎంకే కుట్ర చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. సర్కార్ నుంచి 10మందికి పైగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ కార్పొరేట్ సంస్థ రూ. 180 కోట్లు కేటాయించినట్టు సమాచారం. అయితే, ఎవరూ డబ్బులు, బెదిరింపులకు లొంగలేదని.. డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడి నేతృత్వంలో రూ.35 కోట్ల ఒప్పందం కుదిరిందని నిందితులు పోలీసులకు వెల్లడించినట్టు తెలిసింది.












