పార్టీ పేరు మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి కిందట స్పందించారు. ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు కవిత స్పందిస్తూ సమాధానం ఇచ్చారు.ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఈ విషయంలో న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కవిత స్పష్టంచేశారు. కావాలనే ఈసీ తమను ఇబ్బంది పెడుతోందని పలుమార్లు కవిత ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆమె పార్టీ పేరు రిజస్ట్రేషన్ సమయంలోనూ ఈసీ త్వరగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కవిత.. కోర్టు ఆదేశాల తర్వాత ఈసీ కవిత పార్టీ రిజిస్ట్రేషన్ మీద నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కవిత ఈసీ అభ్యంతరాలపై న్యాయపోరాటం చేస్తానని తెలపడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో టార్గెట్ చేయాలనే కవిత..ఉద్యమపార్టీ టీఆర్ఎస్ పేరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు చాలా సుపరిచితం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం పేరు మార్చి పాత పార్టీ పేరును కొనసాగించాలని చూస్తుండగా.. దానికి మరింత టైం పట్టేలా ఉంది. అందుకే బీఆర్ఎస్ కవిత పార్టీ పేరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాసినట్టు తెలిసింది.












