తెలంగాణ

‘రాజీనామాకు సిద్ధం, చర్చకు రండి’.. కేసీఆర్, కేటీఆర్‌లకు మంత్రి జూపల్లి సవాల్

రచన: Desk 23 నిమిషాల పఠనం

రాష్ట్ర అప్పుల గణాంకాలపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మాటల కంటే, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర అప్పుల గణాంకాలపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మాటల కంటే, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రాజకీయాల్లోకి వచ్చింది ఎవరిలాగో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి కాదని, ఆత్మగౌరవంతో కూడిన రాజకీయాల కోసమే తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేశానని గుర్తుచేశారు.

 అసెంబ్లీ వేదికగా అప్పులపై కేటీఆర్ ఒకసారి రూ.3.17 లక్షల కోట్లు, మరోసారి రూ.3.85 లక్షల కోట్లు అని భిన్నంగా మాట్లాడారని మంత్రి అన్నారు. అదేవిధంగా హరీశ్ రావు కూడా ఒక సందర్భంలో రూ.4.17 లక్షల కోట్లు, ఇంకో సందర్భంలో రూ.4.26 లక్షల కోట్లు అంటూ గందరగోళ పరిచే లెక్కలు చెప్పారని విమర్శించారు. వారు చెబుతున్న అప్పుల లెక్కలను రుజువు చేయాలని, ఒకవేళ తాను చెప్తున్న రూ.8.21 లక్షల కోట్ల లెక్క తప్పని తేలితే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

అదేవిధంగా కార్పొరేషన్ల పేరిట అప్పులు తెచ్చింది ఎవరో చెప్పాలని, అసలు ఆ అప్పులతో ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వ ఖజానా నుండి వాటిని ఎందుకు చెల్లిస్తున్నారో సమాధానం ఇవ్వాలన్నారు. ఎలాగూ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి, కనీసం మీడియా సమావేశం ద్వారానైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. చివరగా, వ్యక్తిగత విమర్శలు ఆపి, అసలు విషయంపై మాట్లాడాలని హితవు పలుకుతూ... ఈ సవాల్‌తో "పాలమూరు పౌరుషమో" లేక "కల్వకుంట్ల పౌరుషమో" తేలిపోతుందని జూపల్లి వ్యాఖ్యానించారు.

#ministerjupally#kcr#ktr#jupallykrishnaraocomments#tgminister#telanganapolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి