ఏపీ

Ap : ఢిల్లీలో ఏపీకి కొత్త భవనం.. ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రచన: Desk 13 నిమిషాల పఠనం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో ఏపీ కోసం సరికొత్తగా భవనం నిర్మించాలని భావిస్తోంది. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని పాత ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఇప్పటికే పూర్తి అయింది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో ఏపీ కోసం సరికొత్తగా భవనం నిర్మించాలని భావిస్తోంది. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని పాత ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఇప్పటికే పూర్తి అయింది.దీంతో తమకు కేటాయించిన స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీకి కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.ఇందుకు రూ.105 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.ఈ భవనం దేశ రాజధానిలో ఏపీ రాష్ట్ర ప్రధాన పరిపాలన,అత్యున్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆతిథ్య కేంద్రంగా సేవలు అందించనుంది.

ఇదిలాఉంటే, కొత్త ఏపీ భవన్ భవన నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అత్యంత నాణ్యత, పారదర్శకతను పాటించే ట్రాక్ రికార్డ్ ఉన్నందున, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వీలుగా NBCCకి బాధ్యతలను కట్టబెట్టినట్టు సమాచారం. ఇకపై హస్తినకు వచ్చే ఏపీ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అన్ని వసతులు ఒకేచోట దొరికేలా.. అదేవిధంగా ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా భవన డిజైన్లను రూపొందించినట్టు తెలిసింది. త్వరలోనే నూతన భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగనుందని తెలుస్తోంది.

#New building#ap bavan#delhi#cm chandrababu#pawankalyan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి