Communal Issues

TTD : తిరుమల వెళ్తే భక్తులకు షాకింగ్ న్యూస్

రచన: Desk 12 నిమిషాల పఠనం

కలియుగదైవం వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చినట్టు తెలుస్తున్నది. పెళ్లిళ్ల సీజన్ కావడం,

కలియుగదైవం వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చినట్టు తెలుస్తున్నది. పెళ్లిళ్ల సీజన్ కావడం, ఈనెల 9 తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో కొందరు భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అక్కడ భారీగా రద్దీ ఏర్పడింది. ప్రస్తుతం కొండ మీద భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి చాలా సమయం పడుతున్నట్టు సమాచారం.

ఇదిలాఉంటే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా.. వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నట్టు సమాచారం. ఇక టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీఐపీ భక్తులపై ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. కంపార్ట్మెంట్లు అని భక్తులతో కిటకిటలాడుతున్నట్టు సమాచారం.కాగా, నిన్న శ్రీవారిని 66,304 మంది భక్తులు దర్శించుకోగా.. 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తెలిసింది. ఇక స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.

#tirumala#TTD#devotees#Andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి