అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నగరంలోని హోటల్స్ లో ఇటీవల హెచ్ ఫాస్ట్ నిర్వహించిన దాడుల్లో కుళ్లిన మాంసం, పరిసరాలు అపరిశుభ్రతతో ఉన్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నగరంలోని హోటల్స్‌లో తినేందుకు జనాలు జంకుతున్నారు.చాలా రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని బిర్యానీల్లో కలుపుతున్నారని హెచ్ ఫాస్ట్ పోలీసులు గుర్తించారు. దీనికి తోడు నాసిరకం పదార్థాలను తినే ఆహారంలో మిక్స్ చేస్తున్నారని గుర్తించి పలు హోటల్స్ మీద చర్యలకు సైతం ఉపక్రమించారు.
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మటన్‌లో ఎద్దు మాంసం కలుపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. హబీబ్‌నగర్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్న ఉస్మాన్ ఖురేషిని హెచ్ ఫాస్ట్ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా అరెస్ట్ చేశారు.మల్లెపల్లిలోని నిందితుడి షాపుపై దాడి చేసి 50 కేజీల కల్తీ మాంసాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని వదలకూడదని మండిపడుతున్నారు.












