మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ జట్టు చేరుకుంది. నిన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది.ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది.
ఇక ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయడంతో సౌతాఫ్రికా ఇంటి బాట పట్టక తప్పలేదు.దాంతో ఇంగ్లాండ్ జట్టు మరోసారి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈనెల 5న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఇదిలాఉండగా, టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇదిలాఉంటే మహిళల టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌లలో ఒకరిగా బరిలోకి దిగిన భారత జట్టుకు లీగ్ దశలోనే ఘోర పరాభవం ఎదురైంది.లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డూ ఆర్ డై మ్యాచులో ఓటమి చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే..












