పుణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య జరిగి రెండు వారాలైనా కాలేదు. కానీ, అతని హత్యకు కారకురాలైన సియాలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె, తన ప్రియుడు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.విచారణలో భాగంగా పోలీసులు నిన్న ఆమెను తన ఇంటికి తీసుకెళ్లారు. విచారణ అనంతరం బయటకు తీసుకొచ్చే క్రమంలో మీడియా వాళ్లు అక్కడే ఉన్నారు.
సినియాను మీడియా వాళ్లు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయగా..అందుకు ఆమె రూడ్‌గా బిహేవ్ చేసినట్టు సమాచారం.చేతిని పైకి ఎత్తి మిడిల్ ఫింగర్ చూపిస్తూ మీడియాను దూషించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాబోయే భర్తను పొట్టన పెట్టుకున్న ఆమెలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం లేకపోతే కేతన్ కు చెప్పాల్సింది అని.. అలా చంపడం సరికాదని సోషల్ మీడియా వేదికగా హితవు పలికారు. కాగా, సియా తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి మరీ కేతన్‌ను కొండ మీద నుంచి తోసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.












