తెలంగాణ

తెలంగాణ పోలీస్ భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు!.

రచన: Desk 23 నిమిషాల పఠనం

తెలంగాణలో పోలీస్ బాసుల భద్రతకు కత్తెరపడింది.. మాజీ డీజీపీల ఎస్కార్ట్ వాహనాలు బంద్ చేయగా.. హైదరాబాద్ సీపీకి కూడా బుల్లెట్ ప్రూఫ్.. ఎస్కార్ట్ సేవలు నిలిచిపోనున్నాయి. కేవలం మాజీలే కాదు.. ప్రస్తుత అధికారులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.

తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది! వివిఐపి కల్చర్‌కు చెక్ పెడుతూ.. ఖజానాపై భారాన్ని తగ్గించేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న పలువురు ఉన్నతాధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో దాదాపు 20 మంది మాజీ, ప్రస్తుత పోలీస్ బాసులకు సెక్యూరిటీ తగ్గనుంది. మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మతో పాటు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర వంటి ప్రముఖులకు ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ సేవలు నిలిచిపోనున్నాయి.

కేవలం మాజీలే కాదు.. ప్రస్తుత అధికారులకు కూడా ఈ రూల్ వర్తిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసివేశారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్ వాహనాన్ని కూడా తొలగించారు.

వాహనాలతో పాటే గన్‌మెన్ల సంఖ్యకు కూడా కత్తెర పడింది. పలువురు రాజకీయ నేతలు, అధికారుల భద్రతను వన్ ప్లస్ వన్ గన్‌మెన్లకే పరిమితం చేస్తూ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

#telangana#police#dgp#political#security
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి