Telangana Police Exam Dates: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ప్రాథమిక రాతపరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఎస్ఐ, తత్సమాన పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టుల ఎగ్జామ్‌ను డిసెంబర్ 20న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
జూలై 29న వచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగిసింది. ప్రభుత్వం ఏజ్ లిమిట్ పెంచడంతో 1.13 లక్షల మంది అభ్యర్థులకు మేలు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థులు 5,77,064 అప్లై చేసుకున్నారు. ఇందులో 68 శాతానికి పైగా అభ్యర్థులు ఒకే పోస్టుకు పోటీపడుతున్నారు. పురుషులు 74 శాతం, మహిళలు 25 శాతానికి పైగా అప్లై చేయగా.. బీసీలు 49 శాతం, ఎస్సీ-ఎస్టీ కేటగిరీల నుంచి 43 శాతానికి పైగా అభ్యర్థులున్నారు. అప్లై చేసిన వాళ్లలో అత్యధికులు ఎగ్జామ్‌ను తెలుగులో రాయడానికే ఆసక్తి చూపారు.
ఇక తొలిసారి తీసుకొచ్చిన ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను ఇప్పటికే 97 శాతం మంది పూర్తి చేశారు. ఇది ఇంకా పెండింగ్‌లో ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు లాగిన్ అయి పూర్తి చేసుకుని, తమ అఫీకేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది. పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్‌ను ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది.












