సినిమా

Kaaka: ప్రియమణి ని రీప్లేస్ చేసిన స్నేహ..చిరు జోడీగా బంపర్ ఆఫర్?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kaaka: దర్శకుడు బాబి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాకా. 2027 సంక్రాంతి పండుగ టార్గెట్‌గా ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు సీనియర్ నటి స్నేహ ఇందులో నటించనుందని తెలుస్తోంది.

ప్రియమణి స్థానంలో స్నేహ?

కాకా సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రియమణి హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా ఇటు తెలుగులో అటు తమిళంలో గానీ ప్రియమణికి హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. హిందీ వెబ్ సిరీస్‌కి..టీవీ షోస్‌కే పరిమితమైంది. దీంతో, కాకా సినిమాలో చిరుకి జోడీగా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ అంటే గోల్డెన్ ఛాన్స్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ వార్త ఇంకోలా వినిపిస్తోంది.

కాకా ఫస్ట్ షెడ్యూల్‌లో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ జాయిన్ అయింది. చిరుకి కూతురుగా ఆమె నటిస్తోంది. హైదరాబాద్ సిటీ కాలేజీలో చిరు-అనస్వరలపై కీలకమైన సన్నివేశాలను బాబీ తెరకెక్కించాడు. ఇటీవల వచ్చిన టీజర్‌లో ఆమెను రివీల్ చేయకపోయినా, కథలో ఆమెది ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. ఆ తర్వాత, అనస్వరకి మెగాస్టార్ వెన్నంటే ఉండే పాత్ర అని కూడా పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

ఇక, ఇన్నిరోజుల నుంచి కాకా మూవీలో చిరు జోడీ ఎవరనేది క్లారిటీ లేదు. కానీ, ఎక్కువగా వినిపించింది మాత్రం ప్రియమణి పేరే. కానీ, తాజాగా ఆ ఛాన్స్ స్నేహకి దక్కిందని తెలుస్తోంది. కొన్నేళ్ళ నుంచి స్నేహకి చిరు సరసన నటించాలనేది కోరిక. కాకాలో గనక ఆ ఛాన్స్ వస్తే ఆమె జీవితంలో ఓ పెద్ద కోరిక నెరవేరినట్టే. ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో నటించి హిట్స్ అందుకుంది. ఇప్పుడు, కాకాలో ఛాన్స్ వస్తే నలుగురు సీనియర్స్‌తో నటించిన ఘనత స్నేహకి దక్కుతుంది. కాగా, కె.సత్యం పాత్రలో చిరు, అమ్ములు పాప పాత్రలో అనస్వర కనిపించబోతున్నారు.

#Megastar Chiranjeevi#Kaaka#Bobby#KVN Productions#Actress Sneha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి