తెలంగాణ

Nanakramguda Land Dispute: నానక్‌రామ్‌గూడ భూవివాదంపై చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ

రచన: Mahesh2 నిమిషాల పఠనం

Nanakramguda Land Dispute: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

నానక్‌రామ్‌గూడ పరిధిలో రైతుల నుంచి తాము నిబంధనల ప్రకారమే 10 ఎకరాల స్థలాన్ని కొన్నామని తెలిపారు. తాను, సునీల్‌ కలిసి ఈ ల్యాండ్ తీసుకున్నామని.. ఇందులో సునీల్‌ వాటాగా 3 ఎకరాలు ఉందని వెల్లడించారు. ఈ ఆస్తికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ తమ వద్ద సేఫ్‌గా ఉందని చెప్పారు.

మంత్రీ కాస్మోసిస్‌ గేట్లను ధ్వంసం చేశామని, అక్కడి సెక్యూరిటీ గార్డులను బెదిరించి లోపలికి వెళ్లినట్లు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్టవిరుద్ధంగా ఎవరి స్థలంలోకీ వెళ్లలేదని తేల్చిచెప్పారు. తనపై నమోదైన కేసు నేపథ్యంలోనే ఆయన ఈ వివరణ ఇచ్చారు.

#Nanakramguda Land Dispute#Nanakramguda Land Issue#Chandrasekhar Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి