తెలంగాణ

Nizamabad Murder: యూట్యూబర్‌ వైష్ణవి భర్త దారుణ హత్య

రచన: Mahesh7 నిమిషాల పఠనం

Nizamabad Murder: కొన్ని నెలల కిందట నిండు గర్భిణి అయిన యూట్యూబర్‌ను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు అదే రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ‘వైషు అమ్మ’ ఛానల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి భర్త చిథారి హరిబాబును నిజామాబాద్ నడిబొడ్డున గుర్తుతెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది.

Nizamabad Murder: కొన్ని నెలల కిందట నిండు గర్భిణి అయిన యూట్యూబర్‌ను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు అదే రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ‘వైషు అమ్మ’ ఛానల్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి భర్త చిథారి హరిబాబును నిజామాబాద్ నడిబొడ్డున గుర్తుతెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యను పొట్టనబెట్టుకున్న పాపమే అతడిని వెంటాడిందా? లేక పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార హత్యేనా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

నిజామాబాద్ రోడ్డుపై..

నిజామాబాద్‌లో రద్దీగా ఉండే ఆర్ఆర్ సెంటర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. హరిబాబు అక్కడ ఉండగా, ఉన్నట్లుండి దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న కొబ్బరి కాయలు నరికే కత్తితో హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగులు తీసే లోపే శరీరమంతా తీవ్ర గాయాలు చేయడంతో, హరిబాబు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలు, జనం చూస్తుండగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు.

వైష్ణవి హత్య.. ?

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి, హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘వైషు అమ్మ’ పేరుతో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త హరిబాబు, అత్త లక్ష్మి, బావలు ఆనంద్, అశోక్ ఆమెను తీవ్రంగా వేధించేవారు.

ఈ ఏడాది మార్చి 16 రాత్రి వారి మధ్య చాలా పెద్ద గొడవ జరగడంతో, మార్చి 17న హరిబాబు కత్తితో భార్యను పొడిచి దారుణంగా చంపి, ఆ తర్వాత కోరుట్ల శివారులో దాక్కున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ప్రతీకారమే ప్రాణం తీసిందా?

భార్యను పొట్టనబెట్టుకున్న హరిబాబు హత్యకు, వైష్ణవి మర్డర్ కేసుకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులు లేదా ఆమె బంధువులెవరైనా పగతో ఈ దారుణానికి పాల్పడ్డారా? లేకపోతే వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ ఆర్ఆర్ సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.భార్యను పొట్టనబెట్టుకున్న పాపమే అతడిని వెంటాడిందా? లేక పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార హత్యేనా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

నిజామాబాద్ రోడ్డుపై..

నిజామాబాద్‌లో రద్దీగా ఉండే ఆర్ఆర్ సెంటర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. హరిబాబు అక్కడ ఉండగా, ఉన్నట్లుండి దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న కొబ్బరి కాయలు నరికే కత్తితో హరిబాబుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో పరుగులు తీసే లోపే శరీరమంతా తీవ్ర గాయాలు చేయడంతో, హరిబాబు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలు, జనం చూస్తుండగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు.

వైష్ణవి హత్య.. ?

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి, హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘వైషు అమ్మ’ పేరుతో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి, నాలుగు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త హరిబాబు, అత్త లక్ష్మి, బావలు ఆనంద్, అశోక్ ఆమెను తీవ్రంగా వేధించేవారు.

ఈ ఏడాది మార్చి 16 రాత్రి వారి మధ్య చాలా పెద్ద గొడవ జరగడంతో, మార్చి 17న హరిబాబు కత్తితో భార్యను పొడిచి దారుణంగా చంపి, ఆ తర్వాత కోరుట్ల శివారులో దాక్కున్నాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ప్రతీకారమే ప్రాణం తీసిందా?

భార్యను పొట్టనబెట్టుకున్న హరిబాబు హత్యకు, వైష్ణవి మర్డర్ కేసుకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులు లేదా ఆమె బంధువులెవరైనా పగతో ఈ దారుణానికి పాల్పడ్డారా? లేకపోతే వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ ఆర్ఆర్ సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

#Nizamabad Murder#Vaishnavi Murder Case#Vaishu Amma YouTuber#Chithari Haribabu#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి