సినిమా

KVN Productions: రూమర్స్‌కి చెక్ పెట్టిన "కాకా" టీమ్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

KVN Productions: ప్రస్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎస్టాబ్లిష్ అయిన కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒకటి. మిడ్ రేంజ్ సినిమాలతో పాటు విజయ్ తలపతి, యష్, మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్స్‌తోనూ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ. వెంకట్ కె నారాయణ..వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పుడు, ఈ సంస్థలో రూపొందుతోన్న సినిమా మెగాస్టార్ కాకా.

గత కొన్ని రోజుల నుంచి కాకా చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకోనుందని వార్తలు పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి, కారణం చిరంజీవి నటిస్తోన్న మరో చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ జానర్‌లో మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇంకా, ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడంతో విశ్వంభర రిలీజ్ డేట్‌ను ప్రకటించలేకపోతున్నారని చెప్తున్నారు.

అయితే, ఇటీవలే విశ్వంభర చిత్రాన్ని సోనీ లివ్ తో పోటీ అమెజాన్ ప్రైమ్ వారు భారీ మొత్తానికే ఓటీటీ రైట్స్ దక్కించుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో, విశ్వంభర విడుదల తేదీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నుంచి వాయిదాల మీద వాయిదా పడుతున్న విశ్వంభర కి కాకా డేట్ ఇవ్వనున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీంతో, స్వయంగా కాకా టీమ్ స్పందించక తప్పలేదు. సంక్రాంతి నుంచి కాకా తప్పుకుందని వస్తున్న స్పెక్యులేషన్స్ ని నమ్మవద్దని కేవిఎన్ స్పష్టం చేసింది. చెప్పిన తేదీకే మా సినిమాను 2027 జనవరి 13న రిలీజ్ చేస్తామని మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో, కాకా ఆగమనంలో ఎలాంటి మార్పు లేదని తేలిపోయింది. అయితే, ఇప్పుడు అందరి చూపు విశ్వంభరపై మళ్ళింది. అసలు, ఈ సినిమా 2026లో వస్తుందా? అనే సందేహాలు మళ్ళీ పుంజుకున్నాయి. అంతేకాదు, ఓటీటీ డీల్ క్లోజ్ అన్న వార్తల్లో నిజమెంత?అని కూడా మాట్లాడుకుంటున్నారు.

#KVN Productions#Megastar Chiranjeevi#Kaaka#Bobby#Anaswara Rajan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి