సినిమా

Ranabaali: 130 రోజుల షూటింగ్‌కి ఫైనల్‌గా ప్యాకప్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ranabaali: టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ నుంచి రాబోతున్న పీరియాడికల్ మూవీ రణబాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. ఇటీవల, హీరోయిన్‌గా నటించిన రష్మిక..తన పాత్రకి సంబందించిన షూటింగ్ పూర్తి చేయగా..ఇప్పుడు, మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా దర్శకుడు పోస్ట్ ద్వారా తెలిపాడు. దీంతో, రణబాలి అనుకున్న తేదీకి రిలీజ్ కావడం పక్కా అని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ అంటే ఇప్పటికే, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన టాక్సీవాలా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఆ సమయంలో టాక్సీవాలా పలుమార్లు వాయిదా పడి..జనాలలో కాస్త ఆసక్తి తగ్గింది. సరిగ్గా అదే సమయంలో రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం భారీ హిట్‌గా నిలిచింది.

ఆ జోరులో..విజయ్‌కి మంచి క్రేజ్ అండ్ మార్కెట్ వచ్చింది. దీంతో, టాక్సీవాలా సినిమా రిలీజ్‌కి పరిస్థితులు బాగా అనుకూలించాయి. మంచి సమయం ఇదే అనుకొని సినిమాను రిలీజ్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన టాక్సీవాలా నిర్మాతలకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మళ్ళీ, ఇన్నాళ్ళకి విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న-రాహుల్ సాకృత్యన్‌ల కాంబోలో రణబాలి రూపొందుతోంది. ఇప్పటికే, ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి.

ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమా కంటెంట్ ఏంటో ఓ క్లారిటీ వచ్చింది. విజయ్, రష్మికల కెరీర్‌లో రణబాలి మైల్ స్టోన్ మూవీగా మిగలడం గ్యారెంటీ అనే నమ్మకాలను కలిగింది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అక్టోబర్ 16న పాన్ ఇండియా వైడ్‌గా రణబాలి అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక, తాజాగా ఈ సినిమా 130 రోజుల షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.

#Ranabaali#Vijay Devarakonda#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి