తెలంగాణ

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ ప్రారంభం

రచన: NK3 నిమిషాల పఠనం

KCR Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూములపై విచారణ ప్రారంభించారు. ఫామ్ హౌస్ భూముల లెక్కలు బయటకు తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు.

ఫామ్‌హౌస్‌ కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, రిజిస్ట్రేషన్ రికార్డులు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లను ఆరా తీస్తున్నారు. అటు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ మర్కూక్ తహశీల్దార్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. జిల్లా సర్వేయర్లు, ఎమ్మార్వో సరితతో సమావేశం నిర్వహించి చర్చించారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 700 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఆ వివరాలను బయటకు తీయాలన్నారు. ఫామ్ హౌస్ భూములపై సమగ్ర విచారణ జరిపి 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంపై దృష్టి పెట్టారు.

ఎర్రవల్లిలో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడున్న రికార్డులను పరిశీలిస్తున్నారు. ఫామ్ హౌస్ పరిధిలో కేసీఆర్ కొనుగోలు చేసిన భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత? వివాదాస్పద భూమి పరిస్థితి ఏంటి? అనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత భూ రికార్డుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించే పనిలో పడ్డారు.

#KCR Farmhouse#Enquiry#Erravalli#Revenue Officials#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి