సినిమా

Prabhas-Fauzi: డిసెంబర్ 3 కాదు జనవరి 26..ఇందులో నిజమెంత?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Prabhas-Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి సంబందించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హను రాఘవపూడి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ అని నిర్మాత అధికారికంగా వెల్లడించాడు. కానీ, ఇప్పుడు ఇది దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. డిసెంబర్ 3న కాకుండా 2027 జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.

ప్రభాస్ సినిమా అంటే ఎంత లేదన్నా ఒక్కో సినిమాకి 2 నుంచి 3 ఏళ్ళ సమయం పడుతుందని ప్రతీ సినిమాకి వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా నుంచి ఇలాగే అవుతోంది. పాన్ ఇండియా స్కేల్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో మేకింగ్‌లోనే రెండేళ్ళు ఉంటోంది. అసలు, అంత సమయం ఎందుకు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభాస్ అనే కాదు, పాన్ ఇండియా సినిమా అని ఏ హీరో చేస్తున్నా ఇదే తంతు.

ఇన్నేళ్ళు కష్టపడి సినిమా తీస్తే ఒకే ఒక్క షోతో సినిమా జాతకం తేలిపోతుంది. దాదాపు మూడేళ్ళ నుంచి మేకింగ్‌లో ఉన్న ఫౌజీ సినిమా ఎట్టకేలకి ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవి శంకర్ వెల్లడించాడు. కోకాపేట్‌లో భారీ చార్మినార్ సెట్ వేసి హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా షూట్ చేశారు. దాదాపు, నెలరోజులు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. కానీ, ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం ఇంకా 50 నుంచి 60 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉందట.

ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ వరకూ షూటింగ్ మాత్రమే జరుగుతుంది. ఇక, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్..ప్రమోషన్స్ అంటే వాస్తవానికి జనవరికి కూడా పాజిబుల్ కాకపోవచ్చు. మరి, నిర్మాతలేమో చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఈ గందరగోళమైన పరిస్థితుల్లో మరోసారి మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ వస్తేనే ఫౌజీ విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజంగానే ఫౌజీ పోస్ట్ పోయి ఐతే డార్లింగ్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవుతారు.

#Prabhas#Fauzi#Hanu Raghavapudi#Mythri Movie Makers#Imanvi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి