సినిమా

Dulquer Salmaan: దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Dulquer Salmaan: మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార'. తెలుగులో మంచి మార్కెట్ అండ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మలయాళ హీరో నుంచి రాబోతున్న ఈ లేటెస్ట్ మూవీ విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేశారు. నవంబర్ 20వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్‌గా నేడు విడుదల తేదీని ప్రకటిస్తూ దుల్కర్ ఉన్న కొత్త పోస్టర్‌ను వదిలారు.

మాహానటి, లక్కీ భాస్కర్, సీతారామంలతో క్రేజ్:

మలయాళ నటులకి తెలుగులో క్రేజ్ రావడం అంటే కాస్త కష్టమనే చెప్పాలి. మన టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలని మించి ఆదరణను దక్కించుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ సినిమా చేయడం ఒకెత్తైతే సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకోవడం ఒకెత్తు..మార్కెట్‌ను విస్తరించుకోవడం మరో ఎత్తు. తమిళంలో స్టార్ హీరోలైన అజిత్, విజయ్ లాంటి వారికి స్ట్రైట్ సినిమాలు చేసే ఛాన్స్ రాలేదనే చెప్పాలి.

ధనుష్..సూర్య మాత్రం ఇక్కడ బాగానే ప్లేస్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత, మలయాళ హీరో ఇక్కడ సోలో హీరోగా స్ట్రైట్ సినిమాలను చేసే అవకాశాలతో పాటు అభిమానులను సొంతం చేసుకున్నాడు. మాహానటి, సీతారామం, లక్కీ భాస్కర్..ఇలా వరుసగా తెలుగులో మూడు బ్లాక్ బస్టర్స్‌ను అందుకున్నాడు దుల్కర్. ఈ క్రమంలో 'ఆకాశంలో ఒక తార' మూవీతో రాబోతున్నాడు.

ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్కేల్‌లో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్, అశ్వనీదత్ గారి స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఇక, సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. మరి, ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

#aakasam-lo-oka-tara#Dulquer Salmaan#Pavan Sadhineni#Allu Aravind#Swapna Cinema
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి