తెలంగాణ

దేశానికి వన్నె తెచ్చిన, ప్రజాసేవలో నిమగ్నమైన గొప్ప నాయకుడు.. ప్రధాని మోదీపై ఎంపీ ఈటల ప్రశంసల వర్షం

రచన: NK4 నిమిషాల పఠనం

PM Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ చరిత్ర పుటలపై తిరుగులేని విధంగా లిఖించిన నాయకుడు, ప్రపంచంలో భారత జాతి ఆత్మగౌరవ బావుటాను ఎగురవేసిన నాయకుడు మోదీ అంటూ కీర్తించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్క్‌లో జరిగిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని కేక్ కట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ శుభవేళ ఆయురారోగ్యాలతో దేశ ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం మోడీకి కలగాలని మనసారా కోరుకున్నారు ఈటల రాజేందర్. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు అలుపెరగకుండా, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి గొప్ప ప్రజా నాయకుడు నరేంద్ర మోదీ అని ప్రశంసించారు.

'మేక్ ఇన్ ఇండియా', 'మేడ్ ఇన్ ఇండియా' నినాదాలతో ముందుకెళ్తూ.. రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల నిర్మాణంలో దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (మూలధన వ్యయం) ను ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలకు పెంచి అత్యంత వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతారు. మోదీ మరింత కాలం ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ, దేశ అభివృద్ధి చిత్రపటాన్ని మరింత ఉన్నతంగా ఆవిష్కరించాలి'' అని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు.

#PM Modi#PM Modi Birthday#Eatala Rajender#Bjp#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి